Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి డ్రామాని కనిపెట్టేసిన కోడలు.. ట్విస్ట్ అదుర్స్!
on Dec 19, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -283 లో..... నందిని వెళ్లిపోతు.. నేను ప్రేమించాను కానీ సీతా నన్ను ప్రేమించలేదు.. ప్రేమించడు కూడా ఎందుకంటే సీతాకి నువ్వు చాలా ఇష్టం.. ప్రేమిచడం కంటే ప్రేమించబడడం చాలా అదృష్టమని రామలక్ష్మితో నందిని అంటుంది. మీ అత్తయ్య వల్ల మీరు త్వరలో విడిపోతారు. ఇదంతా మీ అత్తయ్య ప్లాన్ అంటూ శ్రీలత నిజస్వరూపం రామలక్ష్మి ముందు బయట పెడుతుంది నందిని.
ఆ తర్వాత రామలక్ష్మి ఆలోచనలో పడుతుంది. రామలక్ష్మి వెళ్తుంటే సందీప్ పని చేస్తున్నట్లు నటిస్తాడు. అది రామలక్ష్మి చూసి సందీప్ గురించి నందిని చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటుంది. అత్తయ్య ఇంత మోసం చేస్తుందా మారినట్లు నటించి నన్ను తన మాయలో పడెయ్యాలని చూసిందా దీన్ని ఎలాగైనా తిప్పి కొట్టాలని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి మాటలు గుర్తుచేసుకుంటూ సీతాకాంత్ బాధపడుతుంటే.. అప్పుడే అక్కడికి రామలక్ష్మి వస్తుంది. నేనే నందిని వెళ్లామన్నా ఎందుకంటే మన మధ్య దూరం భరించలేనని సీతాకాంత్ అనగానే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న సారీ అని వచ్చి హగ్ చేసుకుంటుంది. అయిన నందిని నాకు తెలుసని ఎవరు చెప్పారనగానే మీరు చూసే చూపులో అర్థమైందని రామలక్ష్మి అంటుంది. అయితే నీపైన నా కళ్లలో ప్రేమ కన్పిస్తుందా అని సీతాకాంత్ సరదాగా మాట్లాడతాడు.
ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. పెద్దాయన ఫోన్ చేసి డీల్ ఒకే అయిందని సీతాకాంత్ కి ఫోన్ చేసి చెప్తాడు. ఆ విషయం సీతాకాంత్ ఇంట్లో అందరికి చెప్తాడు. ఇక ఆ కంపెనీని నేను చూసుకుంటానని ధన అంటాడు. ఆ తర్వాత అందరు సరదాగా మాట్లాడుకుంటర్ కానీ రామలక్ష్మి శ్రీలత వంక డౌట్ గా చూస్తుంది. కాసేపటికి శ్రీలత, శ్రీవల్లి లు మాట్లాడుకుంటారు. శ్రీవల్లి వెళ్లిపోయాక అప్పుడే రామలక్ష్మి వస్తుంది. మీరు నిజంగా మారిపోయారా అని అడుగుతుంది. మారిపోయాను నువ్వు నమ్మాలంటే ఏం చెయ్యాలని శ్రీలత అనగానే.. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అని రామలక్ష్మి అంటుంది. మీకు సిరి ఇష్టమా.. సందీప్ ఇష్టమా అని రామలక్ష్మి అడుగగా సందీప్ అంటుంది శ్రీలత. ధన ఇష్టమా సందీప్ ఇష్టమా అని అడుగగా సందీప్ అంటుంది. మరి సందీప్ ఇష్టమా సీతా సర్ ఇష్టమా అని అడుగగా ఆలోచించకుండా సందీప్ అంటుంది. దాంతో రామలక్ష్మి షాక్ అవుతుంది. శ్రీలత కూడా అయ్యో ఇలా చెప్పానేంటని టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read